ఎలక్టోరల్ బాండ్లు చట్ట విరుద్దం
సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ – దేశంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో రాజకీయ పార్టీలకు చెంప పెట్టు లాంటి తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. ఈ తీర్పు ప్రధానంగా సంపన్నుల పార్టీగా పేరు పొందిన భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పక తప్పదు.
ఎలక్టోరల్ బాండ్లను కొట్టి వేస్తున్నట్లు గురువారం తీర్పు చెప్పింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ఏడేళ్ల కిందట ప్రవేశ పెట్టారు. దీనికి చట్ట బద్దత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్.
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన కేసుపై విచారణ చేపట్టింది ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం. ఇకపై ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయవద్దని ఎస్బీఐని ఆదేశించింది. అన్ని రాజకీయ పార్టీలకు నిధులు ఇవ్వడం అనేది పరిపాటిగా వస్తోంది.
దీనిపై పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకుంది. ఈ పద్దతికి స్వస్తి పలికింది సుప్రీంకోర్టు. ఎలక్టోరల్ బాండ్లను తక్షణమే నిలిపి వేయాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది ధర్మాసనం.
ఇదిలా ఉండగా సీరియస్ కామెంట్స్ చేశారు జస్టిస్ డీవై చంద్రచూడ్. ఎలక్టోరల్ బాండ్ల పథకం ఆర్టికల్ 19(1)ఎ ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని స్పష్టం చేశారు. కంపెనీల చట్ట సవరణ నేరంగా పరిగణించాల్సి వస్తుందని అన్నారు.