నామినేషన్ వేసిన వద్దిరాజు
బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా రాజ్యసభ బరిలో వద్దిరాజుతో పాటు కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరితో పాటు అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్ ను ఎంపిక చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రేణుకా చౌదరి నామినేషన్ దాఖలు చేశారు.
తాజాగా రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ ఓటమి పాలు కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో వారికి సంఖ్యా బలం ఎక్కువగా ఉంది. మరో వైపు ఇటీవలే టీడీపీ నుంచి జంప్ అయ్యారు వనపర్తి జిల్లాకు చెందిన రావుల చంద్రశేఖర్ రెడ్డి.
వద్దిరాజు రవిచంద్రతో పాటు రావులను కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేస్తారని అంతా భావించారు. కానీ అనుకోకుండా కేవలం వద్దిరాజు రవిచంద్ర మాత్రమే ఇవాళ నామినేషన్ దాఖలు చేయడం విశేషం.