NEWSANDHRA PRADESH

వాలంటీర్ల భ‌విష్య‌త్తుకు భ‌రోసా

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన జ‌న‌సేనాని ప‌వ‌న్

అమ‌ర‌వాతి – జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌కు వాలంటీర్ల ప‌ట్ల ఎలాంటి కోపం లేద‌న్నారు. కానీ అధికార పార్టీకి తొత్తులుగా మారిన వాళ్ల ప‌ట్ల మాత్ర‌మే త‌మ‌కు అభ్యంత‌రం ఉందంటూ పేర్కొన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కేవ‌లం వైసీపీకి చెందిన వాలంటీర్ల వ‌ల్ల 33,000 వేల మంది మ‌హిళ‌లు అదృశ్య‌మ‌య్యార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాము అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని , వ‌చ్చిన వెంట‌నే వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌పై స‌మగ్రంగా విచార‌ణ చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు.

అయితే వాలంటీర్లుగా విశిష్ట సేవ‌లు అందిస్తున్న వారిని తాము ఏమీ అన‌బోమంటూ భ‌రోసా ఇచ్చారు. వారికి మ‌రింత తోడ్పాటు అందించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్వాకం కార‌ణంగా ఇవాళ ఏపీ అన్ని రకాలుగా న‌ష్ట పోయింద‌న్నారు.

మూడు రాజ‌ధానుల పేరుతో ఐదేళ్ల పాటు ప్ర‌భుత్వాన్ని న‌డిపించార‌ని, ఇక ప్ర‌జ‌ల గురించి ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు. ఏది ఏమైనా జ‌నం డిసైడ్ అయ్యార‌ని, జ‌గ‌న్ రెడ్డిని ఇంటికి పంపించాల‌ని అన్నారు.