బీఆర్ఎస్ కు షాక్ సునీతా రిజైన్
పార్టీకి..చైర్మన్ పదవికి గుడ్ బై
హైదరాబాద్ – అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒకరి వెంట మరొకరు పార్టీ నుంచి వీడుతున్నారు. శుక్రవారం ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీతా మహేందర్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నారు.
ఈ సందర్బంగా కీలక ప్రకటన చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా తాను పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ఇదే సమయంలో తన రాజీనామా లేఖను నేరుగా బీఆర్ఎస్ పార్టీ బాస్ కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపించారు.
దీంతో భార్యతో పాటు భర్త, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సైతం గులాబీ పార్టీని వీడనున్నారు. దీంతో రంగారెడ్డి జిల్లాలో పూర్తిగా పట్టు కోల్పోయినట్లయింది బీఆర్ఎస్ పార్టీకి. దీనిపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఎవరూ అందుబాటులో లేరు. మొత్తంగా తమ సర్కార్ ను కూల్చి వస్తామన్న మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్ కు సరైన రీతిలో షాక్ ఇచ్చేలా చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు.