TELANGANA

మామా అల్లుళ్ల‌కు ప‌ని లేదు

Share it with your family & friends

సీఎం రేవంత్ రెడ్డి కామెంట్

హైద‌రాబాద్ – మాజీ సీఎం కేసీఆర్ , అల్లుడు హ‌రీశ్ రావుల‌పై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ ఇద్ద‌రికీ ప‌ని లేకుండా పోయింద‌న్నారు. ఎంత సేపు త‌న‌ను, త‌మ పార్టీని తిట్టి పోయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారంటూ మండిప‌డ్డారు.

గ‌త ప‌దేళ్లుగా కొలువు తీరిన మీరు రాష్ట్రానికి ఏం చేశారో చెప్ప‌గ‌ల‌రా అంటూ నిల‌దీశారు. పొద్ద‌స్త‌మానం దోచు కోవ‌డం, దోచుకున్న‌ది ఎలా దాచు కోవాల‌నే దానిపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు త‌ప్పా ప్ర‌జ‌ల గురించి ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు.

ల‌క్ష‌లాది మంది నిరుద్యోగుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారంటూ ఆరోపించారు. అందుకే వాళ్ల ఉద్యోగాలు ఊడ గొడితేనే కానీ మీకు జాబ్స్ రాలేద‌న్నారు. తాము ఇచ్చిన మాట నిల‌బెట్టుకుంటామ‌ని, ఈ ఏడాది పూర్త‌య్యే లోపు 2 ల‌క్ష‌ల కొలువులు భ‌ర్తీ చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు రేవంత్ రెడ్డి.

30 ల‌క్ష‌ల మంది నిరుద్యోగుల‌కు త్వ‌ర‌లోనే తీపి క‌బురు చెబుతామ‌ని స్పష్టం చేశారు. త్వ‌ర‌లోనే గ్రూప్ -1 ప‌రీక్ష‌ను నిర్వ‌హించ బోతున్న‌ట్లు తెలిపారు. త‌న‌ను రాజీనామా చేయాల‌ని హ‌రీశ్ రావు కోర‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు సీఎం.