NEWSTELANGANA

టీఎస్ఎస్పీ తీరుపై ఆర్ఎస్పీ గుస్సా

Share it with your family & friends

ఏఆర్, సివిల్ అభ్య‌ర్థుల‌కు వివ‌క్ష

హైద‌రాబాద్ – బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్య‌ర్థుల‌పై స‌ర్కార్ చూపుతున్న వివ‌క్ష‌ను ఖండిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఏఆర్, సివిల్ తో ఎంపికైన అభ్య‌ర్థులు శిక్ష‌ణ‌కు ఇంకా పిల‌వ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. దీని వ‌ల్ల విలువైన కాలాన్ని, కాల ప‌రిమితిని కోల్పోయే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు.

అప్పుల పాలై టీఎస్ఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 5,010 మంది అభ్యర్థులు తీవ్ర అయోమయానికి, నిరాశకు గురవుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. ఒకే నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఏఆర్ కానిస్టేబుల్స్ కు శిక్ష‌ణ ఇస్తూ టీఎస్ఎస్పీ కింద కానిస్టేబుల్స్ గా ఎంపికైన వారికి శిక్ష‌ణ ఇవ్వ‌క పోవ‌డం వివ‌క్ష చూప‌డమేన‌ని పేర్కొన్నారు.

దీని కార‌ణంగా టీఎస్ఎస్పీకి ఎంపికైన కానిస్టేబుల్స్ రెండు సంవత్సరాలు తమ సర్వీసును కోల్పోతారని వాపోయారు. మరి దీనికి ఎవరు బాధ్య‌త వ‌హిస్తార‌ని ప్ర‌శ్నించారు. పోలీస్ ట్రైనింగ్ అకాడమీలు సరిపడా లేవన్న కారణంతో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్స్ గా ఎంపికైన వారికి ట్రైనింగ్ ఇవ్వక పోవడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనేని ఆరోపించారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.