NEWSTELANGANA

అనిల్ కుమార్ యాద‌వ్ నామినేష‌న్

Share it with your family & friends

రాజ్య‌స‌భ స‌భ్యుడిగా దాఖ‌లు

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున అనిల్ కుమార్ యాద‌వ్ శుక్ర‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఆయ‌న వెంట సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. అనిల్ తో పాటు ఖ‌మ్మం జిల్లాలో కీల‌క‌మైన పాత్ర పోషిస్తూ వ‌స్తున్న కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌద‌రిని కూడా ఎంపిక చేసింది ఏఐసీసీ క‌మాండ్.

ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రేణుక‌, అనిల్ కు అవ‌కాశం ఇచ్చింది. తాజాగా జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని భావించారు రేణుకా చౌద‌రి. అంజ‌న్ కుమార్ యాద‌వ్ కు ఛాన్స్ ల‌భిస్తుంద‌ని అనుకున్నారు. కానీ ఉన్న‌ట్టుండి ఆయ‌న‌కు మొండి చేయి చూపింది. కానీ ఉన్న‌ట్టుండి అంజ‌న్ కుమార్ యాద‌వ్ కొడుకైన అనిల్ కుమార్ యాద‌వ్ కు క‌ట్టబెట్టింది.

ఇదిలా ఉండ‌గా భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ నుంచి వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌ను ఎంపిక చేసింది. ఆయ‌న కూడా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఆయ‌న‌తో పాటు రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి ఛాన్స్ ల‌భిస్తుంద‌ని అనుకున్నారు.
.