అల్లు అర్జున్ మామ జంప్
బీఆర్ఎస్ బై కాంగ్రెస్ కు జై
హైదరాబాద్ – రాష్ట్రంలో సీన్ మారింది. అధికారంలోకి ఊహించని రీతిలో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. గత పది సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యం వహిస్తూ , రాచరిక పాలన సాగించిన బీఆర్ఎస్ బాస్ మాజీ సీఎం కేసీఆర్ కు కోలుకోలేని షాక్ తగిలింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన దౌర్జన్యాన్ని బండ కేసి కొట్టారు ప్రజలు. ఇది పక్కన పెడితే రాజకీయం అంటే కేవలం పదవి మాత్రమేనని నమ్ముతున్నారు నేతలు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇవాళ ఈ పార్టీలో ఉన్న నాయకుడు రేపు ఏ పార్టీలో ఉంటడో తెలియదు. దీంతో కేవలం అధికార యావ తప్ప ప్రజలకు సేవ చేయడం, పనులు చేసి పెట్టే ఆలోచన ఏదీ లేదు. నిన్నటి దాక బీఆర్ఎస్ కండువా కప్పుకున్న ప్రముఖ హీరో అల్లు అర్జున్ పిల్లను ఇచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నట్టుండి గులాబీకి గుడ్ బై చెప్పారు.
ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ సమక్షంలో ఆయన చేరారు. మొత్తంగా త్వరలోనే ఎన్నికలు జరిగే లోపే బీఆర్ఎస్ ఖాళీ అయ్యేలా కనిపిస్తోంది.