కాంగ్రెస్ లో చేరిన జెడ్పీ చైర్ పర్సన్
కండువా కప్పుకున్న సునీతా మహేందర్ రెడ్డి
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి రాజీనామా చేశారు. ఆ వెంటనే నిమిషం ఆలస్యం చేయకుండా గాంధీ భవన్ కు వెళ్లారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ ఆధ్వర్యంలో సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఆమె భర్త ఎవరో కాదు మాజీ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. తాండూరు నియోజకవర్గంలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు కొన్నేళ్లుగా. మొన్నటికి మొన్న భార్యా భర్తలు సునీతా, మహేందర్ రెడ్డిలు మర్యాద పూర్వకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రవేంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్బంగా వారిని వెంటనే పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.
ఆయన కోరికను మన్నించారు మహేందర్ రెడ్డి. ఆ మేరకు శుక్రవారం ఉన్నట్టుండి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ కు లేఖను పంపించారు. తాను ఇక ఉండలేనంటూ పేర్కొన్నారు.