NEWSTELANGANA

సీఎంతో నీలం మ‌ధు భేటీ

Share it with your family & friends

పార్టీ గెలుపు కోసం కృషి చేస్తా

హైద‌రాబాద్ – హైద‌రాబాద్ కు చెందిన ప్ర‌ముఖ నేత నీలం మ‌ధు ముదిరాజ్ బీఎస్పీకి రాజీనామా చేశారు. తాజాగా ఆయ‌న రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు.

అనంత‌రం మ‌ర్యాద పూర్వ‌కంగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయ‌న ఆశీస్సులు తీసుకున్నారు. పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల‌ని సీఎం సూచించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ప్ర‌తిమ‌ను అంద‌జేసి స‌త్క‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం నీలం మధు మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.

పార్టీ అధినాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా సైనికునిగా పనిచేస్తూ పార్టీ అభ్యున్నతికి పాటు పడతామని స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ పార్లమెంటుపై కాంగ్రెస్ జెండా ఎగరవేసి రాహుల్ గాంధీ గారికి బహుమానంగా ఇస్తామని హామీ ఇచ్చారు నీలం మ‌ధు ముదిరాజ్.