NEWSANDHRA PRADESH

అమ‌రావ‌తిని ట‌చ్ చేసే ద‌మ్ముందా

Share it with your family & friends

నిప్పులు చెరిగిన నారా లోకేష్

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఆయ‌న మ‌రోసారి ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు. శంఖారావంలో భాగంగా జరిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. ఎన్ని అడ్డంకులు క‌ల్పించినా, ఎన్ని కుట్ర‌ల‌కు పాల్ప‌డినా తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీ కూట‌మిని ఓడించ లేరంటూ స్ప‌ష్టం చేశారు.

అమ‌రావ‌తి పేరు విన‌ప‌డ కూడ‌ద‌ని ప్ర‌జా రాజ‌ధానిని కావాల‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ధ్వంసం చేశాడ‌ని ఆరోపించారు నారా లోకేష్. ప్ర‌జ‌ల త్యాగాలు, దేవ‌త‌లు ఆశీస్సులు ఉన్న అమ‌రావ‌తి అజ‌రామ‌ర‌మ‌ని , దానిని ఎవ‌రూ అడ్డుకోలేర‌ని హెచ్చ‌రించారు.

విచిత్రం ఏమిటంటే చివ‌ర‌కు సినిమాలో కూడా అమ‌రావ‌తి పేరు వింటే జ‌గ‌న్ రెడ్డి జ‌డుసుకుంటున్నాడ‌ని ఎద్దేవా చేశారు నారా లోకేష్. థియేట‌ర్ లో ఆడుతున్న రాజ‌ధాని ఫైల్స్ సినిమాను కావాల‌ని త‌న అధికారాన్ని ఉప‌యోగించి అడ్డుకుంటున్నాడ‌ని మండిప‌డ్డారు.

జ‌గ‌న్ మ‌రో జ‌న్మ ఎత్తినా అమ‌రావ‌తిని తాక లేడంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.