NEWSANDHRA PRADESH

నేటి నుంచి ప‌లు రైళ్లు ర‌ద్దు

Share it with your family & friends

సౌత్ సెంట్ర‌ల్ రైల్వే వెల్ల‌డి

అమ‌రావ‌తి – ద‌క్షిణ మ‌ధ్య రైల్వే కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప‌నుల మ‌ర‌మ్మ‌తు కార‌ణంగా ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు వెల్ల‌డించింది. గుంటూరు-గుంతకల్లు రైలు మార్గంలో దొనకొండ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రైల్వే డబ్లింగ్ లైను పనుల కారణంగా ఈనెల 17వ తేదీ నుంచి తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

17329 నెంబర్ హుబ్లీ – విజయ వాడ రైలు ఈనెల 17 నుంచి 28వ తేదీ వరకు, 17330 నెంబరు గల విజయవాడ – హుబ్లీ రైలు ఈనెల 18 నుంచి 29 వరకు, 17253 నెంబరు గల గుంటూరు – సికింద్రా బాద్ రైలు ఈనెల 18 నుంచి 29 వరకు ర‌ద్దు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

17254 నెంబరు గల సికింద్రాబాద్ – గుంటూరు రైలు ఈనెల 18 నుంచి 29 వరకు, 17261 నెంబరు గల గుంటూరు -తిరుపతి రైలు ఈనెల 17 నుంచి 28 వరకు, 17262 నెంబరు గల తిరుపతి – గుంటూరు రైలు ఈనెల 18 నుంచి 29 వరకు నిలిపి వేసిన‌ట్లు పేర్కొన్నారు.

17251 నెంబరుగల గుంటూరు – కాచిగూడ రైలు ఈనెల 17 నుంచి 28 వరకు, 17252 నెంబరు గల కాచిగూడ – గుంటూరు రైలు ఈనెల 18 నుంచి 29 వరకు, 17228 నెంబరు గల గుంటూరు – డోన్ రైలు మార్చి 31 వరకు, 17227 నెంబరు గల డోన్ – గుంటూరు రైలు ఏప్రిల్ 1వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేసినట్లు స్ప‌ష్టం చేశారు. ప్ర‌యాణికులు గ‌మ‌నించి స‌హ‌క‌రించాల‌ని కోరారు.