మోదీ సర్కార్ ఫిర్ ఏక్ బార్
బీజేపీ చీఫ్ కె. అన్నామలై
తమిళనాడు – ఆరు నూరైనా సరే ఈసారి కూడా దేశంలో మరోసారి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి తిరిగి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ తమిళనాడు స్టేట్ చీఫ్ కె. అన్నామలై.
మోదీ 3.0 పేరుతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 143 కోట్ల మంది ప్రజానీకం మొత్తం సుస్థిరమైన పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం
లేదన్నారు కె. అన్నామలై.
గతంలో ఎన్నడూ లేని విధంగా మోదీ ప్రధానిగా కొలువు తీరాక భారత దేశం అన్ని రంగాలలో ముందుకు వెళుతోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సమర్థవంతమైన నాయకులలో ప్రధమ స్థానంలో ప్రధానమంత్రి ఉన్నారని ఇంతకంటే ఇంకేం కావాలని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.
ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమికి అంత సీన్ లేదన్నారు. ప్రజలు వారిని విశ్వసించడం లేదని ఎద్దేవా చేశారు కె. అన్నామలై. ఇకనైనా నిరాధారమైన ఆరోపణలు, విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు.