అశ్విన్ ఆట అదుర్స్ – మోదీ
మరిన్ని రికార్డులు బ్రేక్ చేయాలి
న్యూఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన రికార్డు నమోదు చేశారు. అతి తక్కువ మ్యాచ్ లు ఆడిన ఆర్. అశ్విన్ అరుదైన చరిత్ర సృష్టించాడు.
ప్రస్తుతం భారత దేశంలో ఇంగ్లండ్ జట్టు పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఆ జట్టు టీమిండియాతో 5 టెస్టులు ఆడనుంది. మూడో టెస్టు మ్యాచ్ సందర్భంగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించాడు. తన టెస్టు క్రికెట్ చరిత్రలో ఏకంగా 500 వికెట్లను సాధించాడు.
తన కెరీర్ లో అరుదైన మైలు రాయిని సాధించడంపై స్పందించాడు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ప్రత్యేకంగా అభినందనలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా తన స్పందనను పంచుకున్నారు.
ఈ జర్నీలో మరిన్ని రికార్డులు నమోదు చేయాలని, అద్భుత ప్రతిభ కలిగిన రవిచంద్రన్ అశ్విన్ సాధిస్తాడన్న నమ్మకం తనకు ఉందన్నారు.