కాంగ్రెస్ కు భవిష్యత్ లేదు
ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్
న్యూఢిల్లీ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆయన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ఆ పార్టీకి దేశంలో భవిష్యత్తు అన్నది లేకుండా పోయిందన్నారు. నిరంతరం అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయంలో పడేసేందుకు ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకు పోయిందని ఆరోపించారు. ఆ పార్టీని 143 కోట్ల మంది ప్రజలు విశ్వసించడం లేదని స్పష్టం చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో వారు తమను టార్గెట్ చేశారని కానీ సీన్ రివర్స్ అయ్యిందంటూ ఎద్దేవా చేశారు.
ఈసారి కూడా జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సంకీర్ణ కూటమికి కనీసం 400కు పైగానే సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పూర్తిగా నెగటివ్ ఆలోచనలతో ఉండే కాంగ్రెస్ పార్టీ సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశమే లేదన్నారు మోదీ.
హస్తానికి భవిష్యత్తు అన్నది లేదని, ఆ పార్టీ రోడ్ మ్యాప్ గురించి ఆలోచించ లేదన్నారు. ఈ కారణంగానే కరెంట్ విషయంలో ఆ పార్టీ తప్పటడుగు వేసిందన్నారు. కరెంట్ కొరత ఉంటే ఈ దేశం అభివృద్ది సాధించ లేరన్నారు.