పేటీఎం ఫాస్టాగ్ పై నిషేధం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ముంబై – ప్రముఖ చెల్లింపుల సేవల సంస్థ పే టీఎంకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే లావాదేవీలపై నిషేధం విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నియమ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో దేశ వ్యాప్తంగా ప్రచురణ, ప్రసార , డిజిటల్ మీడియా మాధ్యమాలలో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. దీనిపై పీఎంఓ సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ సైతం ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్రమార్కులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అండగా ఉంటున్నాడని ఆరోపించారు. ఈ తరుణంలో పేటీఎం చేసిన ప్రకటనను ఉదహరించారు రాహుల్ గాంధీ.
ఇదిలా ఉండగా తాజాగా ఆర్బీఐ సంచలన ప్రకటన చేసింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏ ఐ) ఫాస్టాగ్ సేవల కోసం 30 అధీకృత బ్యాంకుల జాబితా నుండి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ని తొలగించినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.