NEWSANDHRA PRADESH

జ‌న‌సేన డోంట్ కేర్ నాకే టికెట్

Share it with your family & friends

గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి కామెంట్

అమ‌రావ‌తి – మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తాను పార్టీ స్థాపించిన నాటి నుంచి న‌మ్మ‌కుని ప‌ని చేస్తూ వ‌చ్చాన‌ని స్ప‌ష్టం చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

త‌ను పోటీ చేయాల‌ని అనుకున్న స్థానాన్ని కావాల‌ని జ‌న‌సేన పార్టీ అడుగుతోంద‌ని, ఇందులో త‌ప్పు లేద‌న్నారు. అయితే ఆ పార్టీకి టికెట్ ఇచ్చే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. త‌న‌ను కాద‌ని చంద్ర‌బాబు నాయుడు జ‌న‌సేన పార్టీకి సీటును కేటాయిస్తే ఊరుకోనంటూ పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా జ‌న‌సేన ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా త‌న టికెట్ ను తీసుకోలేర‌న్నారు. రాజ‌కీయాల‌లో తాను చాలా చూశాన‌ని, ఇలాంటివి మామూలేన‌ని లైట్ తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుల్లో తాను ఒక‌డిన‌ని స్ప‌ష్టం చేశారు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి.

జ‌న‌సేన డోంట్ కేర్ అన్నారు. త‌న అనుభ‌వం ఆధారంగా పార్టీ బాస్ చంద్ర‌బాబు త‌న‌కే టికెట్ ఇవ్వ‌క త‌ప్ప‌ద‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేదన్నారు.