NEWSANDHRA PRADESH

21న బీజేపీ..జ‌న‌సేన పొత్తుపై ప్ర‌క‌ట‌న

Share it with your family & friends

బీజేపీతో ఎలాంటి ద్వేషం లేదు

అమ‌రావ‌తి – ఏపీలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. నిన్న‌టి దాకా భార‌తీయ జ‌న‌తా పార్టీని అన‌రాని మాట‌లు అన్న టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఉన్న‌ట్టుండి యూ ట‌ర్న్ తీసుకున్నారు. అధికారం కోసం మోదీ, అమిత్ షా క‌రుణ క‌టాక్షం కోసం నిరీక్షించారు. తన‌కు ఎదురే లేద‌ని ధీమాతో ఉన్న పార్టీ చీఫ్ కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. 53 రోజుల పాటు రాజ‌మండ్రి జైలు జీవితం గ‌డిపారు. బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు నానా తంటాలు ప‌డ్డారు.

ఈ త‌రుణంలో బ‌య‌ట‌కు వ‌చ్చాక దూకుడు పెంచారు చంద్ర‌బాబు నాయుడు. ఆ వెంట‌నే ఢిల్లీకి వెళ్లారు. జ‌న‌సేన‌, బీజేపీతో క‌లిసి టీడీపీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించారు. పొత్తుల‌పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సంద‌ర్బంగా అమిత్ షా తో ఏయే సీట్ల‌లో పోటీ చేయాల‌నే దానిపై పూర్తిగా క్లారిటీ ఇచ్చిన‌ట్లు టాక్.

రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో బీజేపీ, జ‌న‌సేన పార్టీల‌కు క‌లిపి 30 శాస‌న స‌భ స్థానాలు 10 ఎంపీ స్థానాలు కేటాయించేందుకు ఒప్పుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో బీజేపీకి 5 స్థానాలు మిగ‌తా 10 స్థానాల‌లో జ‌న‌సేన‌కు కేటాయించ‌నున్నారు. ఇక పార్ల‌మెంట్ విష‌యానికి వ‌స్తే బీజేపీకి 7 నుంచి 8 స్థానాలు , జ‌న‌సేన పార్టీ ఒక‌టి నుంచి 3 స్థానాల‌లో పోటీ చేయను్న్నారు.

ఈ పొత్తుకు సంబంధించి ఈనెల 21న ప్ర‌క‌టించ‌నున్నారు చంద్ర‌బాబు నాయుడు. ఇక బీజేపీ నుంచి ప‌లువురి సీట్లు కూడా ఖ‌రారైన‌ట్లు స‌మాచారం. వీరిలో విశాఖ నుండి జీవిఎల్, రాజ‌మండ్రి నుంచి పురందేశ్వ‌రి, న‌ర్సాపురం నుంచి ర‌ఘురామ‌రాజు, రాజంపేట నుండి కిర‌ణ్ కుమార్ రెడ్డి, అనంత‌పురం లేదా హిందూపురం నుంచి స‌త్య‌కుమార్ పోటీ చేయ‌నున్న‌ట్లు టాక్.