NEWSTELANGANA

బీసీ కుల గ‌ణ‌న సంచ‌ల‌నం

Share it with your family & friends

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైద‌రాబాద్ – అసెంబ్లీలో బీసీ కుల గ‌ణ‌న తీర్మానం చేయ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. తాము ఇచ్చిన మాట ప్ర‌కారం స‌ర్వే చేప‌ట్ట‌డం చ‌రిత్రాత్మ‌క‌మ‌న్నారు. కొన్ని నిర్ణ‌యాలు స‌మాజ గ‌తిని స‌మూలంగా మార్చుతాయ‌ని చెప్పారు.

త‌ర త‌రాల తరతరాల అన్యాయానికి చరమ గీతం పాడుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో బీసీ జనాభా లెక్క తేల్చాలన్న ప్రజా ప్రభుత్వ నిర్ణయం అటువంటిదేనని పేర్కొన్నారు. ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాల్లో వెనుకబడిన తరగతులకు సమ న్యాయం, సామాజిక న్యాయం దక్కడానికి ఈ కుల జన గణన తిరుగులేని అస్త్రం అవుతుందని అన్నారు రేవంత్ రెడ్డి.

‘మేమెంతో మాకంత’ అన్న బలహీన వర్గాల వాదనతో గొంతు కలిపి ఆ దిశగా నిర్ణయం చేయడానికి త‌మ‌కు దిశా నిర్ధేశం చేసిన రాహుల్ గాంధీకి హృదయ పూర్వక ధన్యవాదాలు ఈ సంద‌ర్బంగా తెలియ చేసుకుంటున్నాన‌ని చెప్పారు సీఎం.

ఎన్నిక‌ల్లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ పార్టీ ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేస్తామ‌ని చెప్పామ‌ని, ప్ర‌స్తుతం ఆచ‌ర‌ణ‌లో చేసి చూపిస్తున్నామ‌ని ఇంత‌కంటే ఇంకేం కావాల‌ని అన్నారు.