రాకింగ్ స్టార్ యష్ వైరల్
కిరాణా కొట్టు వద్ద కొనుగోలు
బెంగళూరు – కన్నడ సినీ సూపర్ రాక్ స్టార్ గా గుర్తింపు పొందిన యష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన కే\జీఎఫ్ చిత్రంతో ఒక్కసారిగా వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యారు. గతంలో పలు సినిమాలలో నటించినా ఈ ఒకే ఒక్క చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇదే సమయంలో తను హీరోగా ఉన్నప్పటికీ ఎక్కడా భేషజాలు ప్రదర్శించడు. అత్యంత సాధారణమైన జీవితం గడిపేందుకు ఇష్ట పడతాడు. సమయం కుదిరితే పుస్తకాలు చదువుతాడు. లేదంటే భార్య, కూతురుతో కలిసి తను ఆరాధించే మఠం వద్దకు వెళతారు నటుడు యష్.
తాజాగా ఈ గ్రేట్ యాక్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. దీనికి ప్రధాన కారణం ఇటీవల ఆయన ఓ చిన్న కిరాణ కొట్టు వద్దకు వెళ్లారు. తన భార్య కోసం ఐస్ క్యాండీని కొనుగోలు చేశారు. యష్ ను చూసిన కొట్టు యజమాని తెగ సంతోషానికి లోనయ్యారు.
యష్ , భార్య కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తున్నాయి. భారీ స్టార్ డమ్ ఉన్నప్పటికీ డోంట్ కేర్ అంటూ ముందుకు సాగుతారు యష్. ఇదిలా ఉండగా కర్ణాటకలోని షిరాలీలోని భత్కల్ లోని చిత్రపుర మఠం ఆలయాన్ని సందర్శించారు.