పెద్దమ్మ తల్లి కృప అందరికీ ఉండాలి
దర్శించుకున్న కవిత..దాసోజు శ్రవణ్
హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ శనివారం జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ దేవాలయాన్ని సందర్శించారు. జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్దన్ రెడ్డి ఆహ్వానం మేరకు తాము ఆలయాన్ని దర్శించుకున్నట్లు తెలిపారు దాసోజు శ్రవణ్ .
ఈ సందర్బంగా పెద్దమ్మ తల్లి అమ్మ వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నానని, సకల జనులంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మ వారిని కోరుకున్నట్లు స్పష్టం చేశారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్.
ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరంలో పెద్దమ్మ తల్లికి పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు. ఇదిలా ఉండగా ఈసారి జరిగిన పెద్దమ్మ తల్లి రథ సప్తమి ఉత్సవాల్లో భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరుంది.
చిన్నారుల నుంచి పెద్దల దాకా పెద్దమ్మ తల్లిని దర్శించు కోవడం గత కొన్ని తరాల నుంచి సంప్రదాయంగా వస్తోంది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర పాలక సంస్థ మేయర్ గద్వాల విజయ లక్ష్మి కూడా పాల్గొన్నారు.