అవినీతికి కేరాఫ్ జగన్ సర్కార్
నిప్పులు చెరిగిన నారా లోకేష్
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన పూర్తిగా అవినీతిలో కూరుకు పోయిందని సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. శనివారం శంఖారావంలో కార్యక్రమంలో భాగంగా శృంగవరపుకోటలో జరిగిన ప్రజా వేదిక సభను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలుగుదేశం, జనసేన , బీజేపీ సంయుక్త కూటమిదే రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని, అధికారాన్ని ఏర్పాటు చేస్తామన్నారు నారా లోకేష్. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. జగన్ రెడ్డి పగటి కలలు కంటున్నాడని, ఆయన చేసిన అరాచక పాలనను చూసి వేగలేక త్వరగా ఇంటికి పంపించాలని జనం డిసైడ్ అయ్యారని అన్నారు.
తాను ఎక్కడికి వెళ్లినా సమస్యలు విన్నవిస్తున్నారని, తాము వచ్చాక అన్నింటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు నారా లోకేష్. ఇన్నాళ్లుగా దోచుకునేందుకే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారంటూ జగన్ పై మండిపడ్డారు. అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. ఇవాళ దేవాలయాలకు కూడా భద్రత కరువైందన్నారు. ఏది ఏమైనా జగన్ కు చుక్కలు చూపించడం ఖాయమని జోష్యం చెప్పారు.