మేడారం జాతరకు నోడల్ ఆఫీసర్స్
నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్ – ప్రపంచంలోనే అతి పెద్ద జాతరగా భావించే ములుగు జిల్లా లోని మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు ఐదు రోజుల పాటు అతి పెద్ద మహా కుంభ మేళాను తలపింప చేసేలా జాతర జరగనుంది.
ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇద్దరు మంత్రులు సీతక్క, సురేఖ దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా సక్సెస్ చేసేందుకు గాను సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ప్రత్యేకంగా మేడారం జాతరకు నోడల్ ఆఫీసర్లను నియమించింది.
శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ఐదుగురు ఐఏఎస్ అధికారులను నియమించారు. వీరిలో ఆర్వీ కర్ణన్ , కృష్ణ ఆదిత్య, ఆదర్శ్ సురభి, ప్రతిమా సింగ్ , రాధికా గుప్తాలకు బాధ్యతలు అప్పగించారు.
ఇప్పటికే భారీ ఎత్తున ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. అంగరంగ వైభవంగా ఏర్పాట్లలో మునిగి పోయారు అధికారులు. లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ తో పాటు రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.