కాంగ్రెస్ సర్కార్ బక్వాస్
మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ – కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేశారు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కావాలని, పనిగట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం తమపై బురద చల్లుతోందంటూ ఆరోపించారు. దీనిని ఖండిస్తున్నట్లు చెప్పారు.
తాము ఏ విచారణకైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు హరీశ్ రావు. విచిత్రం ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు అంద లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీనిని తాము ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు.
ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అతి ముఖ్యమైన ప్రాజెక్టుగా అభివర్ణించారు. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన నివేదిక ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టు కింద 20 లక్షల ఎకరాలకు నీళ్లు అందాయని స్పష్టం చేశారు హరీశ్ రావు.