NEWSNATIONAL

కాంగ్రెస్ కు క‌మ‌ల్ నాథ్ క‌టీఫ్

Share it with your family & friends

త్వ‌ర‌లో బీజేపీలోకి జంప్

మ‌ధ్య‌ప్ర‌దేశ్ – త్వ‌ర‌లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో ఉన్న‌ట్టుండి ఇండియా కూట‌మి లోని కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ త‌గులుతోంది. ఒక‌రి వెంట మ‌రొక‌రు బీజేపీలోకి జంప్ అయ్యేందుకు దుకాణం స‌ర్దుకుంటున్నారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘమైన రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా, మాజీ సీఎంగా విశిష్ట సేవ‌లు అందించిన క‌మ‌ల్ నాథ్ ఉన్న‌ట్టుండి మ‌న‌సు మార్చుకున్నారు. తాను పార్టీని వీడ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న హోదాను , పార్టీ పేరును కూడా తీసి వేశారు.

విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఆయ‌న‌కు ఎనలేని ప్రాధాన్య‌త ఇచ్చింది. కేవ‌లం ప‌ద‌వి ఇవ్వ‌క పోవ‌డం వ‌ల్ల‌నే పార్టీని వీడ‌డం విస్తు పోయేలా చేసింది. సింధియా వ‌ర్గం ఆగ్ర‌హంతో ఉన్న‌ప్ప‌టికీ క‌మ‌ల్ నాథ్ ను సీఎంగా ఛాన్స్ ఇచ్చింది పార్టీ.

కమల్‌నాథ్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై 9 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఎల్‌ఓపీగా పని చేశారు . పీవీ నరసింహారావు ప్రభుత్వంలో కమల్‌నాథ్‌ కేంద్ర మంత్రిగా ప‌ని చేశారు. అంతే కాకుండా ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో కమల్ నాథ్ వివిధ శాఖలతో కేంద్ర మంత్రిగా చేశారు.

అంతే కాదు 16వ లోక్‌సభలో ప్రొటెమ్ స్పీకర్‌గా కమల్‌నాథ్ నియమితులయ్యారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కమల్ నాథ్ నియమితులయ్యారు. కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌నాథ్‌కు కాంగ్రెస్‌ లోక్‌సభ టికెట్‌ ఇచ్చింది. అయినా పార్టీకి గుడ్ బై చెప్ప‌డం బాధాక‌రం.