బీజేపీకి అసలైన పోటీ ఆప్
సీఎం అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ – ఆప్ చీఫ్ , న్యూఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందంటూ ధ్వజమెత్తారు. ఆదివారం సీఎం మీడియాతో మాట్లాడారు. దేశాన్ని భ్రష్టు పట్టించిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు ఎదురే లేదని , రాజుగా ఫీలవుతున్నారంటూ మండిపడ్డారు.
దేశంలో కేవలం ఒక్క బీజేపీ మాత్రమే ఉండాలని కోరుకుంటున్నారని, ఆయనతో పాటు తన పార్టీ పరివారమంతా ఇదే జపం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అరవింద్ కేజ్రీవాల్. 2024లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ , దాని అనుబంధ పార్టీల కూటమి (ఎన్డీఏ) గెలుపొందినా చివరకు ఈ దేశంలో కాషాయానికి సరైన ప్రత్యామ్నాయం ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు సీఎం.
ఏది ఏమైనా బీజేపీకి అతి పెద్ద సవాల్ ఆప్ నేనని మరోసారి కుండ బద్దలు కొలట్టారు. ఇవాళ బీజేపీ ఎవరికైనా భయపడిదే అది ఒక్క తమ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఇవాళ ఢిల్లీతో పాటు పంజాబ్ లో పాగా వేశామని, త్వరలోనే గుజరాత్ , ఇతర రాష్ట్రాలలో కూడా ఆప్ జెండా ఎగర వేయడం ఖాయమని జోష్యం చెప్పారు.