కర్ణాటకలో హామీలకు ఢోకా లేదు
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
కర్ణాటక – తాము ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడం జరుగుతోందని చెప్పారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. బెంగళూరులో జరిగిన కీలక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఇప్పటి వరకు 5 హామీలను ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలను అమలు చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఆ రాష్ట్రానికి మన రాష్ట్రమే పునాది అని పేర్కొన్నారు. శక్తి పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు కోటి 60 లక్షల మంది బస్సులలో ప్రయాణం చేస్తున్నారని తెలిపారు.
గృహ లక్ష్మి పథకం కింద కోటి కంటే ఎక్కువ మంది మహిళల బ్యాంక్ ఖాతాలలో ప్రతి నెలా రూ. 2,000 జమ చేస్తోందన్నారు. గృహ జ్యోతి కింద 2 కోట్ల గృహాలకు ప్రతి నెలా 200 యూనిట్ల మేర ఉచితంగా విద్యుత్ ఇస్తుందని చెప్పారు ఖర్గే.
అన్న భాగ్య పథకం కింద ప్రతి నెలా ఏకంగా 4 కోట్ల కుటుంబాలకు 10 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇచ్చామన్నారు. యువ నిధి కింద దాదాపు లక్ష మంది యువతీ యువకులకు రూ. 3,000, 1500 నిరుద్యోగ భృతి ఇస్తున్నామని స్పష్టం చేశారు ఏఐసీసీ చీఫ్.