పట్టణాల అభివృద్దిపై ఫోకస్
మంత్రి దామోదర రాజ నరసింహ
సంగారెడ్డి జిల్లా – పట్టణాల అభివృద్దిపై తమ ప్రభుత్వం ఫోకస్ పెడుతుందన్నారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణ అభివృద్దిపై ముఖా ముఖి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ప్రసంగించారు దామోదర రాజ నరసింహ.
కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు వెళతామని స్పష్టం చేశారు. ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాము ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో సమ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు.
ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల అభివృద్దికి సంబంధించి ఇప్పటి వరకు గత ప్రభుత్వం పట్టించు కోలేదని ఆవేదన చెందారు. కానీ తాము వచ్చాక వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు దామోదర రాజ నరసింహ.
ఎవరైనా సరే అభివృద్దికి సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇవ్వ వచ్చని తాము స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు ఆరోగ్య శాఖ మంత్రి.