వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ – కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపించారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రాష్ట్ర సర్కార్ మెడలు వంచి కేఆర్ఎంబీకి అప్పగించ బోమని చెప్పించామన్నారు.
ఇది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమన్నారు. తాము గొంతు విప్పిన తర్వాతే అసెంబ్లీలో తీర్మానం చేశామని చెప్పారు హరీశ్ రావు. ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రభుత్వ వైఖరిని నిలదీయడం జరిగిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన పీపీటీ తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. తాము కూడా ఫాక్ట్ షీట్ విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రింట్, మీడియా, సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు హరీశ్ రావు. వాస్తవాలు తెలియ చేస్తామన్నారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వం పెట్టింది వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్ కాదన్నారు. తమను ఇరికించాలని అనుకుని వారే పప్పులో కాలేశారంటూ ధ్వజమెత్తారు. అందులో చోటు చేసుకున్న తప్పులు ఎత్తి చూపితే సమాధానం చెప్పకుండా దాట వేశారంటూ ఆరోపించారు.