తెలంగాణ బిల్లుకు పదేళ్లు
సంబండ వర్ణాల ప్రయత్నం
హైదరాబాద్ – ఇవాళ శుభ దినం. ప్రత్యేకించి ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటం, ఉద్యమం కల సాకారమైన రోజు. లోక్ సభలో తెలంగాణ బిల్లు పాసైన రోజు. ఇవాల్టితో తెలంగాణ బిల్లుకు పది సంవత్సరాలు పూర్తయ్యాయి.
సరిగ్గా ఫిబ్రవరి 18, 2014లో చరిత్రాత్మకమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లుకు ఆమోదం లభించింది. ఒక రకంగా చెప్పాలంటే కొత్త చరిత్రకు నాంది పలికిన రోజుగా నిలిచి పోతుంది. ఎప్పటికీ ఉంటుంది. యావత్ నాలుగున్నర కోట్ల ప్రజల స్వప్నం సాకారమైంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లును లోక్‌సభ పూర్తిగా ఆమోదించింది. వెనువెంటనే రాజ్యసభలో ఫిబ్రవరి 20న బిల్లు ఆమోదం పొందింది. ఇది ఒక రోజుతో జరగలేదు. యావత్ ప్రపంచం విస్తు పోయేలా చేసింది తెలంగాణ ఉద్యమం. నాలుగున్నర కోట్ల మంది మూకుమ్మడిగా కుల, మతాలకు అతీతంగా భాగం పంచుకున్నారు.
వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. బలిదానం చేసుకోవడం చరిత్రలో నిలిచి పోయింది. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించారు.