స్వామి ఆశీర్వాదం మోదీ సంతోషం
విద్యాసాగర్ జీ మహరాజ్ ఆశీస్సులు
న్యూఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెగ సంతోషానికి లోనయ్యారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని ప్రత్యేకంగా పంచుకున్నారు. నా ఆలోచనలు, ప్రార్థనలు స్వాములతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు ప్రధానమంత్రి.
ఇది తన జీవితంలో మరిచి పోలేని రోజుగా పేర్కొన్నారు మోదీ. ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహారాజ్ జీవితం మొత్తం ఆదర్శ ప్రాయంగా నిలిచి ఉందని తెలిపారు. ఆయనను అసాంఖ్యక రీతిలో భక్తులు కొలుస్తున్నారు.
సమాజానికి ఆయన చేసిన అమూల్యమైన కృషికి, ముఖ్యంగా ప్రజలలో ఆధ్యాత్మిక జాగృతికి విద్యా సాగర్ మహారాజ్ జీ పేదరిక నిర్మూలన, వైద్యం, విద్య మరిన్నింటి కోసం చేసిన కృషికి రాబోయే తరాలు గుర్తుండి పోతాయని స్పష్టం చేశారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
స్వామి వారి ఆశీర్వాదం కోసం ఎన్నో ఏళ్లుగా తాను నిరీక్షిస్తున్నానని, కానీ ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు ఇవాళ ఆ కోరిక తీరిందని స్పష్టం చేశారు. గత ఏడాది చివరలో ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌ఘర్‌లోని చంద్రగిరి జైన మందిరాన్ని సందర్శించడం నేను ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు.