అగ్ని ప్ర‌మాదాల‌పై హైడ్రా అవ‌గాహన‌

శ్రీ‌కారం చుట్టిన క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో వ‌రుస‌గా అగ్ని ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవ‌లే నాంప‌ల్లి లోని ఫ‌ర్నీచ‌ర్ షో రూంలో భారీ ప్ర‌మాదం చోటు చేసుకుంది. దీంతో హైడ్రా అప్ర‌మ‌త్తం అయ్యింది. క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్వ‌యంగా న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల‌లో ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ త‌నిఖీల‌లో స‌రైన ప్ర‌మాణాలు పాటించ‌డం లేద‌ని గుర్తించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఆపై నియ‌మ నిబంధ‌న‌లు పాటించని షాపుల‌కు తాళాలు వేశారు. ఇదే స‌మ‌యంలో ఫైర్ సేఫ్టీ పై అవ‌గాహ‌న శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు.

హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశాల మేర‌కు హైడ్రా , ఇత‌ర శాఖ‌ల సమ‌న్వ‌యంతో హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల‌లో అవ‌గాహ‌న శిబిరాలు చేప‌ట్టారు. ప్ర‌మాదాలు సంభ‌వించిన‌ప్పుడు ఎలా వ్య‌వ‌హరించాలి, ఎలా బ‌య‌ట ప‌డాల‌నే దానిపై వివ‌రించారు. కార్మికులు,వ్యాపారులు ఎలా భద్రంగా ఎలా బ‌య‌ట ప‌డాలో సూచించారు. షాపులలో ఫైర్ ఎగ్జిట్ మార్గాలను గుర్తించడం.. మంట‌లు అంటుకుంటే అగ్ని మాప‌క శాఖ‌కు చెందిన 101తో పాటు.. హైడ్రా కంట్రోల్ రూమ్ 1070తో పాటు 9000113667 కు ఫోను చేయాల‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా కొన్ని చోట్ల ఫైర్ మాక్ డ్రిల్స్ నిర్వ‌హించారు.

  • Related Posts

    అసెంబ్లీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

    అమ‌రావ‌తి : అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల తరఫున జనసేన బలమైన గొంతు వినిపించాల‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. అసెంబ్లీ జరిగే ప్రతి నిమిషం విలువైనదేన‌ని పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను, ఇబ్బందులను ప్రజా ప్రతినిధులుగా బాధ్యతగా సభ ముందుకు…

    బీసీఐ చైర్మ‌న్ పై భ‌గ్గుమ‌న్న న్యాయ‌వాదులు

    న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మ‌న్ మానన్ కుమార్ మిశ్రా . నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా విద్యార్థుల వివాదం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది . బీసీఐ చైర్మ‌న్ రాజీనామా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *