యశస్వి జైస్వాల్ సెన్సేషన్
పిన్న వయసులో డబుల్ సెంచరీలు
రాజ్ కోట్ – భారత్ , ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ లో యువ క్రికెటర్ యశస్వి జైశ్వాల్ రికార్డు సృష్టించాడు. టెస్టు సీరీస్ లో రెండు డబుల్ సెంచరీలు నమోదు చేయడం విశేషం. అతి చిన్న వయసులో సెంచరీలతో రికార్డు సృష్టించాడు.
అంతే కాదు అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్ గా నిలిచాడు. 147 ఏళ్లలో తొలిసారి ఈ రికార్డు నమోదు కావడం విశేషం. మూడో టెస్టులో ఇంగ్లండ్ కు 557 రన్స్ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందులో జైశ్వాల్ ఇన్నింగ్స్ సెన్సేషన్. ఇందులో 12 సిక్సర్లు కొట్టాడు .
గతంలో పాకిస్తాన్ కు చెందిన క్రికెటర్ వసీం అక్రమ్ పేరుతో ఉన్న రికార్డును చెరిపేశాడు జైశ్వాల్. 1996లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ తరపున ఆడిన వసీం 12 సిక్సర్లు కొట్టాడు. ఇన్నేళ్ల కాలంలో ఒక టెస్టు సీరీస్ లో 20 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు యశస్వి.
రోహిత్ శర్మ గతంలో కొన్ని సిక్సర్లు కొట్టాడు. ఈ తాజాగా ఇన్నింగ్స్ లో జైశ్వాల్ 14 ఫోర్లు, 12 సిక్సర్లు కొట్టాడు. 104 రన్స్ వద్ద రిటైర్డ్ అయ్యాడు. ఇవాళ తిరిగి వచ్చాడు. సర్ఫరాజ్ తో కలిసి 214 రన్స్ వద్ద నాటౌట్ గా నిలిచాడు.