యుద్దానికి సిద్ధం గెలుపు ఖాయం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
అమరావతి – వైసీపీ బాస్ , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాలను ఏకి పారేశారు. సిద్దం పేరుతో ఆయన ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు. సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బహిరంగ సభలను నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడులో చేపట్టిన సిద్ధం సభకు భారీ ఎత్తున జనం పోటెత్తారు. కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా 12 లక్షల మందికి పైగా జనం హాజరైనట్లు అంచనా. ఇది జగన్ పనితీరుకు, పాలనా పరంగా ప్రజలకు ఏ మాత్రం ప్రేమ తగ్గలేదని చెప్పేందుకు ప్రత్యక్ష సాక్ష్యం.
ఈ సందర్బంగా అశేష జన సమూహాన్ని చూసి ఉప్పొంగి పోయారు జగన్ మోహన్ రెడ్డి. ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి ఆశలు ఫలించవని పేర్కొన్నారు. ఫ్యాన్ ఇంటి లోపల ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి..ఉపయోగించిన టీ గ్లాసు వాష్ బేషిన్ లో ఉండాలంటూ విపక్షాలపై సెటైర్ వేశారు ఏపీ సీఎం.
దేశంలో ఎక్కడా లేని రీతిలో ఒక్క ఏపీలోనే అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతోందన్నారు. ఇవాళ బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు ఎనలేని ప్రయారిటీ ఇచ్చామన్నారు సీఎం.