సీఎంతో వక్ఫ్ బోర్డు చైర్మన్ భేటీ
రేవంత్ రెడ్డికి సభ్యుల ధన్యవాదాలు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సయ్యద్ అజ్మతుల్లా మర్యాద పూర్వకంగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయనతో పాటు వక్ఫ్ బోర్డు సభ్యులు సైతం కలుసుకున్నారు. ఈ సందర్బంగా చైర్మన్, సభ్యులు సీఎంకు , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉండగా ఈసారి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఊహించని రీతిలో పదేళ్ల పాటు పవర్ లో ఉన్న బీఆర్ఎస్ కు జనం కోలుకోలేని షాక్ ఇచ్చారు. దీంతో బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఏఐసీసీ హై కమాండ్ నామినేటెడ్ పదవులపై ఫోకస్ పెట్టింది.
ప్రస్తుతం త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఆశావహులకు ప్రయారిటీ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఆ మేరకు రెండు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంస్థ చైర్మన్ గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను నియమించారు. ఆయనతో పాటు మరికొందరు సభ్యులకు ఛాన్స్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.
ఆ వెంటనే వక్ఫ్ బోర్డుకు పూర్తి స్థాయిలో పదవులను కట్టబెట్టారు. ఇంకా భర్తీ చేయాల్సిన పోస్టులు చాలా ఉన్నాయి.