మరాఠా ఎన్నికల్లో ఎంఐఎం పోటీ
ప్రకటించిన అసదుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్ – ఎంఐఎం పార్టీ చీఫ్ , ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన చేశారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎంఐఎం పోటీ చేస్తుందని వెల్లడించారు. తాము దేశ వ్యాప్తంగా విస్తరించామని, అందులో భాగంగా బరిలో ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు.
ఈ దేశంలో ముస్లింలు అన్ని రంగాలలో వెనుకబాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ అభివృద్దిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నా ఇంకా వారి పట్ల వివక్ష కొనసాగుతోందని వాపోయారు. అన్ని పార్టీలు తమ సామాజిక వర్గాన్ని కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని పేర్కొన్నారు ఓవైసీ.
తమకు రాష్ట్ర అభివృద్ది ముఖ్యమని, ఏ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉందన్నది ముఖ్యం కాదని స్పష్టం చేశారు. తాము ప్రభుత్వానికి బేషరతుగా కొన్ని రూల్స్ కు అనుగుణంగా మద్దతు ఇవ్వడం జరుగుతుందన్నారు అసదుద్దీన్ ఓవైసీ.
ఇక మరాఠా ఎన్నికల్లో ఎంఐఎం తప్పక విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు ఎంఐఎం పార్టీ చీఫ్.