NEWSTELANGANA

జీవ‌న్ రెడ్డిపై ధ‌ర్మ‌పురి గుస్సా

Share it with your family & friends

క‌ర‌ప‌త్రాలు పంచింది ఆయ‌నే
హైద‌రాబాద్ – భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి చెందిన శాస‌న మండ‌లి స‌భ్యుడు జీవ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు.

త‌న‌తో పెట్టుకుంటే చివ‌ర‌కు ఇబ్బంది ప‌డ‌డం త‌ప్ప ఇంకేమీ ఉండ‌ద‌న్నారు. ఎన్ని కుట్ర‌లు, కుతంత్రాలు ప‌న్నినా త‌న‌ను ఓడించ‌డం కాంగ్రెస్ చేత కాద‌న్నారు ధ‌ర్మ పురి అర‌వింద్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

త‌న మీద క‌క్ష గ‌ట్టి క‌ర‌ప‌త్రాలు పంపిణీ చేయించింది ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డేనంటూ సీరియ‌స్ అయ్యారు బీజేపీ ఎంపీ. మీరు ఎక్క‌డ క‌నిపించినా తాను వంగి దండం పెడ‌తాన‌ని, కానీ మీకు త‌న‌లో అహంకారం ఎక్క‌డ క‌నిపించిందో చ‌ప్పాల‌ని అన్నారు . తాను అద్దాలు పెట్టుకుంటే మీ త‌మ్ముడికి ఎందుకు అంత భ‌యం అంటూ ఎద్దేవా చేశారు.

రాజ‌కీయాలలో రెడ్లు మాత్ర‌మే ఉండాలా అని ప్ర‌శ్నించారు ధ‌ర్మ పురి అర‌వింద్.