గ్రూప్-1 నోటిఫికేషన్ రిలీజ్
563 పోస్టులతో కొత్తగా వెల్లడి
హైదరాబాద్ – తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. వేలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే కొత్తగా 63 పోస్టులను కలుపుకుని ఇవాళ మళ్లీ పరీక్ష చేపట్టేందుకు గాను నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటోంది టీఎస్పీఎస్సీ.
దాదాపు 10 వేల కోట్లకు పైగా అక్రమంగా ఆస్తులను కలిగి ఉన్నాడని పేర్కొంటూ ప్రముఖ న్యాయవాది రాపోలు భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో రాజ్యాంగ బద్దమైన పోస్టుకు చైర్మన్ గా అనర్హుడంటూ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు ఫిర్యాదు చేశారు.
ఆయనను ఇంకా కొనసాగించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రకటనలో కొత్తగా 563 పోస్టులతో నోటిఫికేషణ్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈనెల 23 నుంచి వచ్చే మార్చి 14 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. వయో పరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచుతున్నట్లు తెలిపింది.