నిజాయితీ అధికారిని బదిలీ చేస్తే ఎలా
నిప్పులు చెరిగిన బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీ
హైదరాబాద్ – బీఎస్పీ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పాలకుల తీరు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర పశు సంవర్దక శాఖ లో డైరెక్టర్ గా పని చేస్తున్న సబావత్ రాంచందర్ ను అర్ధాంతంరంగా బదిలీ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన తన జీవిత కాలమంతా నిజాయితీగా సేవలు అందించాడని కొనియాడారు. కేవలం మూడు నెలల సర్వీసు ఉన్న సమయంలో ఉన్నట్టుండి ట్రాన్స్ ఫర్ చేశారంటూ ఆరోపించారు ఆర్ఎస్పీ. తండాలో పుట్టడమే సబావత్ చేసిన నేరమా అని ప్రశ్నించారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినా నిలదీశారా అని మండిపడ్డారు.
గొర్రె పిల్లల కుంభకోణంలో కీలక పాత్ర వహించిన మంత్రులను, వాళ్ల ఓఎస్డీలను, ఆనాటి డైరెక్టర్లను ముట్టుకునే ధమ్ముందా మీకు అని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఆర్ఎస్పీ. రిటైర్ అయినా ఆధిపత్య వర్గాలకు చెందిన అధికారిని ఓఎస్డీగా నియమించారని ధ్వజమెత్తారు. యధేచ్చగా కుంభకోణం సాగించారని, సదరు అధికారిని సలహాదారుగా ఇంకా కొనసాగిస్తున్నా ఎందుకని నోరు విప్పడం లేదన్నారు.