రేవంత్ ను కలిసిన చిన జీయర్
సమతా కుంభ్ -2024 కు ఆహ్వానం
హైదరాబాద్ – నిన్నటి దాకా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చిన శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామీ ఉన్నట్టుండి హైదరాబాద్ లో ప్రత్యక్షం అయ్యారు. గత కొంత కాలంగా చిన జీయర్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. గత సర్కార్ హయాంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు స్వామీజీ.
ప్రధానంగా కోట్లాది మంది కొలిచే కొంగు బంగారంగా భావించే సమ్మక్క సారలమ్మ దేవతలపై చిన జీయర్ నోరు పారేసుకున్నారు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. చివరకు క్షమాపణలు చెప్పక పోతే తీవ్ర పరిణామలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు భక్తులు.
ఆనాడు ములుగు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క ఇవాళ మంత్రిగా ఉన్నారు. విచిత్రం ఏమిటంటే ఆమె సీఎంకు బహిరంగ మద్దతుదారుగా ఉన్నారు. ఈ తరుణంలో ఉన్నట్టుండి చిన జీయర్ స్వామి సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కలుసు కోవడం చర్చనీయాంశంగా మారింది. సమతా కుంభ్ 2024 శ్రీ రామానుజ చార్య 108 దివ్య దేశాల ద్వీతీయ బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎంను ఆహ్వానించారు.