ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ
భట్టితో పాటు శ్రీధర్ బాబు
న్యూఢిల్లీ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఐటీ, పరిశ్రమల, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు. ఈసారి కొత్తగా భట్టితో దుద్దిళ్ల ఉండడం విశేషం.
ఢిల్లీ టూర్ లో ముందుగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ తో కలువనున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించి కేబినెట్ ను విస్తరించే ప్లాన్ లో ఉన్నారు. మంత్రివర్గంలో ఇప్పటి దాకా 12 మంది ఉన్నారు. ఇందులో డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు. ఇంకా ఆరు మందికి చోటు కల్పించాల్సి ఉంది. ఇప్పటికే ఆశావహులు
సైతం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు.
ఇదిలా ఉండగా మొత్తం 40 కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లు, సభ్యులను భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు రెండు కార్పొరేషన్లకు చైర్మన్లు, సభ్యులను నియమించారు. ఇదే సమయంలో పలువురు కేంద్ర మంత్రులను కలుసుకోనున్నారు. వీరిలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ , రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పట్టణాభివృద్ది శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ తో భేటీ అవుతున్నారు.