NEWSNATIONAL

ప‌రువు న‌ష్టం కేసులో రాహుల్ కు ఊర‌ట‌

Share it with your family & friends

బెయిల్ మంజూరు చేసిన సుల్తాన్ పూర్ కోర్టు

న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీకి భారీ ఊర‌ట ల‌భించింది. దేశంలో త్వ‌ర‌లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో తీవ్ర‌మైన ఉత్కంఠ‌కు తెర దించుతూ మంగ‌ళ‌వారం ప‌రువు న‌ష్టం కేసులో బెయిల్ ల‌భించింది. దీంతో పార్టీ శ్రేణులు సంతోషానికి లోన‌వుతున్నారు. ప‌లు చోట్ల సంబురాలు చోటు చేసుకున్నాయి.

ఇదిలా ఉండ‌గా సుల్తాన్ పూర్ కోర్టుకు రాహుల్ గాంధీ హాజ‌ర‌య్యారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని అన‌రాని మాట‌లు అన్నారంటూ ఆరోప‌ణ‌లు చేస్తూ పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు కోర్టును ఆశ్ర‌యించారు. రాహుల్ గాంధీ కావాల‌ని ఉన్న‌త‌మైన ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విలో కొలువు తీరిన పీఎంను టార్గెట్ చేశారంటూ ఆరోపించారు.

వెంట‌నే అరెస్ట్ చేయాలంటూ పిటిష‌న్ లో పేర్కొన్నారు. ఇవాళ ప‌రువు న‌ష్టం కేసు న‌మోదైంది. దీనిపై తీవ్ర‌మైన వాదోప‌వాదాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో భారీ ఊర‌ట‌ను ఇస్తూ తీర్పు చెప్పింది. ఈ మేర‌కు సుల్తాన్ పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ఈ మేర‌కు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.