సొంత గూటికి ఆళ్ల రామకృష్ణా రెడ్డి
క్యాంప్ ఆఫీసుకు చేరుకున్న నేత
అమరావతి – వైఎసీపీ సీనియర్ నాయకుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి తిరిగి స్వంత గూటికి చేరుకున్నారు. ఆయన గత కొంత కాలంగా పార్టీకి నిబద్దుడై ఉన్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు ఆర్కే.
ఇదిలా ఉండగా రాజ్య సభ ఎంపీ గా ఉన్న అయోధ్య రామి రెడ్డితో కలిసి వైసీపీ బాస్ , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అయితే పార్టీ పరంగా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ విజయం సాధించేందుకు గాను ఆళ్ల రామకృష్ణా రెడ్డికి బాధ్యతలు అప్పగించనున్నారు పార్టీ బాస్.
త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. జాతీయ మీడియా సంస్థలు ఈసారి జగన్ మోహన్ రెడ్డికి ఎదురుగాలి వీస్తోందని ప్రచారం చేస్తున్నాయి. మరో వైపు ఇటీవలే పార్టీ పట్ల తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఆర్కే. చివరకు పార్టీ హై కమాండ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. చివరకు ఆళ్ల రామకృష్ణా రెడ్డి తిరిగి స్వంత గూటికి చేరుకున్నారు.