NEWSNATIONAL

ప్ర‌భుత్వానికి జ‌య‌ల‌లిత బంగారం

Share it with your family & friends

బెంగ‌ళూరు కోర్టు సంచ‌ల‌న తీర్పు

క‌ర్ణాట‌క – బెంగ‌ళూరు కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూసిన దివంగ‌త త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత కేసుకు సంబంధించి తుది తీర్పు ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా జ‌య‌ల‌లితకు ల‌క్ష‌లాది మంది అభిమానులు ఉన్నారు. ఆమె రాజ‌కీయాల్లోను, సినిమాల్లోనూ రాణించింది. త‌న‌దైన ముద్ర వేసింది.

సీఎంగా ఉన్న స‌మ‌యంలో లెక్క‌కు మించి ఆస్తులు , ఆభ‌ర‌ణాలు ఉన్నాయ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఆమె మరణించిన సమయంలో ఎన్నో ఆస్తులు వివరాలు, బ్యాంక్ బ్యాలెన్స్ గురించి చర్చకు వచ్చాయి.

తాజాగా బెంగళూరులోని 36వ సిటీ సివిల్ కోర్టు జయలలితకు సంబంధించిన వ‌జ్రాలు, ఆభ‌ర‌ణాల‌ గురించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆమెకు చెందిన 27 కిలోల బంగారం, వజ్రాభరణాలను ఈ ఏడాది మార్చి 6, 7 తేదీల్లో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి అప్పగిస్తామని కోర్టు వెలువ‌రించింది.

అవినీతి కేసులో జయలలిత దోషిగా తేలి నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన దాదాపు పదేళ్ల తర్వాత, ఆమె మరణించిన ఏడేళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జయలలిత చరాస్తులు, స్థిరాస్తులను వేలం వేయడమే ప్రత్యేక కోర్టు ప్రస్తుత విచారణలో ఉంది. ఆభరణాలను వేలం వేసిన తర్వాత కోర్టు ఆమె స్థిరాస్తులను వేలానికి తీసుకురానుంది.