ధరణి మధ్యంతర నివేదిక సిద్దం
త్వరలోనే సర్కార్ కు సమర్పణ
హైదరాబాద్ – రాష్ట్రంలో భూముల లావాదేవీలకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటోంది గత బీఆర్ఎస్ సర్కార్ తీసుకు వచ్చిన ధరణి . ఈ మేరకు కేసీఆర్ ప్రభుత్వం కూలి పోయింది. జనం కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టారు. ఆపై కల్వకుంట్ల కుటుంబానికి షాక్ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు తీరింది. వచ్చిన వెంటనే ఆయా శాఖలను సమీక్షించారు సీఎం. ఈ మేరకు కీలకమైన నిర్ఱయాలను తీసుకున్నారు. అంతే కాకుండా వేలాది మంది రైతులను కన్నీళ్లు తెప్పించేలా చేసిన ధరణిపై సమగ్ర స్థాయిలో విచారణకు ఆదేశించారు. ఇందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
ఈ మేరకు మధ్యంతర నివేదిక సిద్దం చేసింది ధరణి కమిటీ. రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డిని కలవనుంది కమిటీ. స్వల్పంగా కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం. ప్రత్యేకించి ధరణి కారణంగా ఫారెస్ట్ , దేవాయాదాయ శాఖ భూములు ఎక్కువగా అన్యాక్రాంతం అయినట్లు తేలింది. మరికొన్నింటిని మార్పులు చేయాలని సూచించింది ధరణి కమిటీ.