రాబోయే రాజ్యం మనదే అధికారం
స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్
అమరావతి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాబోయేది టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వమని జోష్యం చెప్పారు. రాజమండ్రి లోని పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్ , రాజనగరం, అనపర్తి నియోజకవర్గాల ముఖ్య నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా నేతలను ఉద్దేశించి ప్రసంగించారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో జగన్ పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. ప్రజలు పూర్తిగా డిసైడ్ అయ్యారని రాక్షస పాలన సాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని అన్నారు.
తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలతో కలిసికట్టుగా జనసేన నేతలు, కార్యకర్తలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఈసారి గెలుపే లక్ష్యంగా సాగాలని పిలుపునిచ్చారు.
మన కూటమికి కనీసం 100కు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.