NEWSANDHRA PRADESH

ప్ర‌భుత్వంలోకి వ‌చ్చేది మేమే

Share it with your family & friends

జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి – ఏపీలో టీడీపీ, జ‌న‌సేన కూట‌మి త‌ప్పక విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇంటికి వెళ్ల‌డం త‌థ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ క‌లిస్తే ఏ శ‌క్తి ఆప‌లేద‌న్నారు. జ‌గ‌న్ రాక్ష‌స పాల‌న‌ను త‌ట్టుకోలేక పోతున్నారంటూ పేర్కొన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. కుటుంబాల‌ను విడ‌గొట్టాల‌ని చూస్తే ఆయ‌న కుటుంబ‌మే విడి పోయిందంటూ ఎద్దేవా చేశారు.

తోడ బుట్టిన చెల్లెలికి ఆస్తిలో వాటా ఇవ్వ‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు మేలు ఎలా చేస్తాడంటూ ప్ర‌శ్నించారు. బీసీల‌కు ప‌ద‌వులు కాదు నిర్ణ‌యాధికారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అక్ర‌మ కేసులు బ‌నాయించిన వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం జ‌న‌సేన నాయ‌కుల స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు.