బీజేపీ సర్కార్ స్కామ్ లకు కేరాఫ్
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – ఏఐసీసీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలో 69,000 మంది టీచర్ పోస్టుల కుంభకోణం గురించి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. బీజేపీ సర్కార్ రిజర్వేషన్ వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రాథమిక విద్యా రూల్స్ 1981 , రిజర్వేషన్ రూల్స్ 1994 ను విస్మరించడం ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. దీని వల్ల దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన వారికి అన్యాయం జరిగిందని వాపోయారు .
విద్యార్థులు తనను కలుసుకున్నారని, ఈ రిక్రూట్ మెంట్ లో ఓబీసీ కేటగిరీకి 27 శాతానికి బదులు 3.86 శాతం మాత్రమే అమలు చేశారని, ఎస్సీ కేటగిరీకి 21 శాతం బదులు 16.6 శాతం మాత్రమే అమలు చేశారంటూ తనతో ఫిర్యాదు చేశారని తెలిపారు రాహుల్ గాంధీ.
దీని కారణంగా 19 వేల పోస్టులకు మంగళం పాడిందన్నారు. ఈ నియామక ప్రక్రియ పూర్తిగా అనుమానాలకు తావిస్తోందని ఆవేదన చెందారు వాయనాడు ఎంపీ.