ప్రజల తీర్పు ప్రశంసనీయం
బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్
హైదరాబాద్ – బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజలే చరిత్ర నిర్మాతలని, వారిని కాదని అనుకున్న వాళ్లు , నేతలు అడ్రస్ లేకుండా పోయారని అన్నారు . ఈ విషయాన్ని గుర్తించక పోవడం వల్లనే అనూహ్యమైన రీతిలో ఓటమి పాలయ్యారంటూ మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్ కుమార్.
తనకు ఎదురే లేదని, తాను రాజునని పదేళ్ల కాలం పాటు ప్రవర్తించారంటూ మండిపడ్డారు. ప్రజలను చరిత్రలో లేకుండా చేయాలని అనుకున్నారని, కానీ ఆయనను అడ్రస్ లేకుండా చేశారంటూ స్పష్టం చేశారు. తాము తల్చుకుంటే ఏమైనా చేయగలమని నిరూపించారని తెలిపారు బండి సంజయ్ .
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో అమరులయ్యారని, వారి త్యాగాలు వెల కట్ట లేమన్నారు. వారి చేసిన ఆత్మ బలిదానాల వల్లనే కొత్త రాష్ట్రం ఏర్పడిందన్నారు . కానీ బీజేపీ ప్రజలను, చేసిన త్యాగాలను మరిచి పోదన్నారు బండి సంజయ్ కుమార్.