హామీలు అమలు చేస్తే తప్పుకుంటా
ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్
యాదాద్రి జిల్లా – మాజీ మంత్రి , బీజేపీ సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఆర్థిక మంత్రిగా తాను చెబుతున్నానని , ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ గనుక ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తే రాజకీయాల లోంచి తప్పుకుంటానని ప్రకటించారు.
బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ్ సంకల్ప యాత్రలో భాగంగా భాగ్యలక్ష్మి క్లస్టర్ – యాదాద్రి భువనగిరి జిల్లా లోని ఆలేరు, మోటకొండూర్, ఆత్మకూర్ లో నిర్వహించిన బ్యాక్ ర్యాలీ , రోడ్ షో లో పాల్గొని ప్రసంగించారు.
దేశంలో సమర్థవంతమైన, సుస్థిరమైన పాలన కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. మోదీ ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ లీడర్ గా ఎదిగాడని కొనియాడారు. దేశం ఆయన నాయకత్వంలో పురోగమి సాధిస్తోందని చెప్పారు ఈటల రాజేందర్.
ప్రాంతాలతో తేడాలు లేకుండా, దక్షిణ, ఉత్తర భారత దేశ ప్రజలు ఆయనను ఆదరిస్తున్నారని తెలిపారు. మళ్లీ ఆయనే ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు . రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లను బీజేపీ తప్పకుండా కైవసం చేసుకుంటుందన్నారు.